అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు: బి.జి.ఆర్

ఆదిలాబాద్ (CLiC2NEWS): ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజల ఎంతో కాలంగా ఎదురు చూస్తూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యులు బాలూరి గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం కంటే ముందుగానే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇందులో భాగంగానే కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించేందుకు గాను పలువురు వైద్యులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నారు.
రిమ్స్ ఆస్పత్రిలో అవుట్ పేషెంట్ భాగంలోని 29/B గదిలో యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, పీడియాట్రిక్ సర్జన్ (పిల్లల) ముగ్గురు ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.యూరాలజిస్ట్ డాక్టర్ ప్రతి శుక్రవారం రోజున, న్యూరో సర్జన్ ప్రతి సోమా, మంగళ వారం రోజుల్లో, పీడియాట్రిక్ సర్జన్ (పిల్లల) డాక్టర్ ప్రతి మంగళవారం, అదే విధంగా 2వ శనివారం, 4వ శనివారం అందుబాటులో ఉంటారని తెలిపారు. కావున ఉమ్మడి జిల్లాలోని ప్రజలందరూ ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆదిలాబాద్ ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కరుణాకర్ లకు గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.