బాల్క సుమన్‌కు చెన్నూరు లాయర్ల మద్దతు!

చెన్నూరు (CLiC2NEWS): చెన్నూర్ బార్ కౌన్సిల్ లో గురువారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ , చెన్నూరు శాసన సభ్యులు బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లాయర్లతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అడ్వకేట్ల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. లాయర్ల వినతులను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా చెన్నూరు బిఆర్ ఎస్ అభ్యర్థిగా బాల్కసుమన్‌కు లాయర్లు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బార్ కౌన్సిల్ కొత్త సత్తయ్య, చెన్నూర్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, అడ్వకేట్లు నిరంజన్, కమలా మనోహర్, కార్తీక్, రమేష్, పూనమ్, లక్ష్మణ్, బండారి శ్రీనివాస్ బండారి, రాజేష్ రాజు, కుమార్ వసంత్, తదితరులు పాల్గొన్నారు.
కోర్టు సముదాయంలో నిర్వహించిన సమావేశంలో CLiC2NEWS ప్రతినిధి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, క్లిక్ 2 న్యూస్ కప్‌ను అందజేశారు.
