150 కెమెరాల‌తో కిల్ల‌ర్ టైగ‌ర్ కోసం నిఘా..

భోపాల్ (CLiC2NEWS): మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌సేన్ ఫారెస్ డివిజ‌న్‌లోని మాన‌వ నివాస ప్రాంతాల్లో ఓ పులి ఇటీవ‌ల 62 ఏళ్ల వృద్ధుడిపై దాడిచేసింది. దీంతో స్థానికంగా ఉండే ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. దాన్ని బంధించేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. స‌మీప ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్రం చేశారు. అడ‌వుల్లోకి ఎవ‌రూ వెళ్లోద్ద‌ని సూచ‌న‌లు చేస్తున్నారు. 36 గ్రామాల్లో రెడ్ అల‌ర్డ్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే 100 సిసి కెమెరాల‌తో నిఘా కొన‌సాగుతుండ‌గా.. మ‌రో 50 కెమెరాల‌తో నిఘా పెంచారు. దానిని బంధించేందుకు ఎర‌ల‌తో కూడిన మూడు బోన్లు ఏర్పాటు చేశారు. పులి వారానికి ఓ సారి వేటాడుతుందని.. ఈ నేప‌థ్యంలో మ‌రో రెండు , మూడు రోజుల్లో మ‌రోసారి దాడికి పాల్ప‌డ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. అందుకు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌లో తీవ్ర‌భ‌యాందోళ‌న నెల‌కొంది.

Leave A Reply

Your email address will not be published.