మ‌ణిపూర్ లో డ్రోన్లు, హెలికాప్ట‌ర్ల‌తో నిఘా!

ఇంఫాల్  (CLiC2NEWS): మ‌ణిపూర్‌లో సైన్యం నిఘాను మ‌రింతాగా పెంచింది. మ‌ణిపూర్‌లో జాతుల మ‌ధ్య నెల‌కొన్న ఘ‌ర్ష‌ణ‌ల నేపథ్యంలో చురాచాంద్‌పుర్‌లో భ‌ద్ర‌తా ద‌ళాలు విధించిన క‌ర్ఫ్యూను ఇవాళ తాత్కాలికంగా మూడు గంట‌ల పాటు స‌డ‌లించారు. మ‌ణిపూర్ ప‌రిస్థితిపై ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధి మీడియాతో మాట్లాడారు.
“ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం గ‌గ‌న త‌ల నిఘాను క‌ట్టుదిట్టం చేసింది. నిఘా కోసం ఇంఫాల్ లోయ‌లో డ్రోన్ల‌ను, హెలికాప్ట‌ర్ల‌ను మోహ‌రించాం“ అని వెల్ల‌డించారు

ఇవాళ ఉద‌యం ఏడు నుండి తాత్కాలికగా 3 గంట‌ల పాటు క‌ర్ఫ్యూ ఎత్తేయ‌డంతో నిత్యావ‌స‌రాల కోసం ప్ర‌జ‌లు వీధుల్లోకి వ‌చ్చారు. తిరిగి క‌ర్ఫ్యూ 10 గంట‌ల‌కు విధించారు. అలాగే సాయంత్రం 3 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూను స‌డ‌లించారు. కా గా ఈ అల్ల‌ర్ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 13000 మంది నిర్వాస‌తులు అయ్యారు. 54 మంది ప్రాణాలు కోల్పోయారు.

Leave A Reply

Your email address will not be published.