సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సప్పెన్షన్

అమరావతి (CLiC2NEWS): ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఇసి సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల వెంకట్రామిరెడ్డి కడప జిల్లా బద్దేలులో వెఎస్ ఆర్సిపి కి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్టిసి ఉద్యోగులతో సమావేశమై వైఎస్ ఆర్సిపికి ఓటు వేయాలని ప్రచారం చేశారని ఇసికి ఫిర్యాదు చేశారు. దీనిపై కడప జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. దీనిపై ఇసి చర్యలు తీసుకుంది. ఇసి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్ క్వాటర్స్ దాటి వెళ్లొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.