నగరంలో అనంతపురం యువకుడి ఆనుమానాస్పద మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని మాదాపూర్‌లో సాయి అనే యువకుడు అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. అతను అనంతపురం జిల్లా వాసిగా గుర్తించారు. సాయి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల ప్రిలిమ్స్ పరీక్ష రాసి అర్హత సాధించి, మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. అయ్యప్ప సొసైటిలోని ఓ హోటల్ ఆరో అంతస్తు నుండి కిందపడి సాయి మృతి చెందాడు . హోటల్ గదిలో సాయి స్నేహితులు నలుగురు ఉన్నట్లు సమాచారం. పోలీసులు విచారణ చేపట్టారు.