స్వామి రామానంద తీర్ధ గ్రామీణ సంస్థ‌.. ఉపాధి కోర్సులు

Technical Training Courses : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా జ‌లాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ‌లో ఉపాధి కోర్సుల‌కు ఉచితంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభ్య‌ర్థులు సాంకేతిక శిక్ష‌ణ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థులు ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఉచిత శిక్ష‌ణ‌, భోజ‌నం, వ‌సతి క‌ల్పించ‌నున్నారు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుండి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు సంబంధిత ఒరిజిన‌ల్ సర్టిఫికెట్స్‌, ఆధార్ కార్డు, ఇన్‌కం స‌ర్టిఫికెట్ కాపీలు, ఫోటోల‌తో సంప్ర‌దించ‌గ‌ల‌రు. చిరునామా స్వామి రామానంద తీర్ధ గ్రామీణ సంస్థ‌, జ‌లాల్‌పూర్ (గ్రామం), పోచంప‌ల్లి (మండ‌లం), యాదాద్రి భ‌వ‌న‌గిరి జిల్లా. ఏప్రిల్ 15వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు అడ్మిష‌న్‌లు ప్రారంభ‌మ‌వుతాయి.

వివిధ కోర్సుల వివ‌రాలు

ఆటోమొబైల్ టూవీల‌ర్ స‌ర్వీసింగ్ : 3 నెల‌లు
అర్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి

సెల్‌ఫోన్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజ్ రిపేర్ : 4 నెల‌ల‌
అర్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి

సోలార్ సిస్ట‌మ్ ఇన్‌స్ట‌లేష‌న్ / స‌ర్వీస్ 4 నెల‌ల‌
అర్హ‌త : ప‌దోత‌ర‌గ‌తి, ఐటిఐ

ఎల‌క్ట్రీషియ‌న్ (డొమెస్టిక్‌) 5 నెల‌లు
అర్హ‌త ప‌దోత‌ర‌గ‌తి, ఐటిఐ

బేసిక్ కంప్యూట‌ర్స్ (డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్)
అర్హ‌త :ఇంట‌ర్మీడియ‌ట్‌

అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలి)
అర్హ‌త : బికాం

Leave A Reply

Your email address will not be published.