రాష్ట్ర స్థాయి క‌రాటే పోటీల్లో మండ‌పేట విద్యార్థుల ప్ర‌తిభ‌..

మండపేట (CLiC2NEWS): న్యూ డ్రాగన్ చైనీస్ కుంగ్ ఫూ అకాడమీ గ్రాండ్ మాస్టర్ పిట్టా రాజబాబు శిక్షణలో కుంగ్ ఫూ విద్యార్ధులు తెలంగాణ రాష్ట్ర కేంద్రం హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రుద్రమదేవి షోటో ఖాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కుంగ్ ఫూ అండ్ కరాటే చాంపియన్ షిప్ 2022 పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొని విద్యార్థులు మండపేటకు పలు పతకాలు సాధించి పెట్టారు. ఇందులో బ్లాక్ బెల్ట్ విభాగంలో ఎండీఎస్ సందీప్ గోల్డ్ మెడల్ సాధించాడు. బ్లూ బెల్ట్ విభాగం నుండి శివ శంకర్ మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధించాడు. ఎంఎస్ రాజు బ్రౌన్ బెల్ట్ కు ఎక్కి రెండవ స్థానంలో నిలిచి వెండి పతాకాన్ని తెచ్చి పెట్టాడు. కే వెంకట తరుణ్, కే మోహన్ రావు, సేహెచ్ ప్రసన్న కుమార్ లు ఆరెంజ్ బెల్ట్ తరపున రెండో స్థానంలో నిలిచి వీరు కూడా వెండి పతకాలు కైవసం చేసుకున్నారు. ఎల్లో బెల్ట్ లో జీ మణికంఠ వెండి పతకం దక్కించు కున్నాడు. షేక్ అయ్యబ్ ఆరెంజ్ బెల్ట్ , ఆర్ ఎస్ కే భూపతి ఎల్లో బెల్టు విభాగాల్లో పాల్గొని థర్డ్ ప్లేస్ లో నిలిచి కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ మాస్టర్ రాజబాబు ఇచ్చిన శిక్షణ, నేర్పిన మెళుకువల కారణంగా జాతీయ స్థాయి కరాటే పోటీలలో రాణించ గలిగామని సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.