TamilNadu: కరోనాతో అనాథలైన చిన్నారుల రూ.5లక్షల సాయం

చెన్నై (CLiC2NEWS): కరోనా కారణంగా అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు తమిళనాడు సిఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. ఈ డబ్బును చిన్నారుల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీసుకోవచ్చని ప్రకటించారు. ఇక, ఆ చిన్నారులకు స్కూల్, కాలేజ్, గ్రాడ్యుయేషన్ వరకు విద్యా మరియు వసతి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అలాంటి అనాథ పిల్లల కోసం ప్రభుత్వ గృహాల్లో వసతి కల్పించడానికి ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహాల్లో కాకుండా తమ బంధువుల ఇళ్లల్లో ఉండాలనుకునే వారికి 18ఏళ్లు వచ్చేవరకు ప్రతి నెలా 3వేలు అందజేస్తామని ప్రకటించారు.