మన కార్టూనిస్ట్ భూపతికి `తానా` అవార్డు
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/tana-award-bhupathi2.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): అంతర్జాతీయ స్థాయిలో మన కార్టూనిస్టు భూపతికి ఉత్తమ కార్టూనిస్టు అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అంతర్జాతీయ స్థాయిలో `తెలుగు బాష సంస్కృతి“ అనే అంశంపై నిర్వహించిన పోటీల ఫలితాలను సోమవారం (16-01-2023) ప్రకటించింది. ఈ పోటీలలో తెలంగాణలోని కరీంగనర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు,
`CLiC2NEWS` కార్టూనిస్టు తునికి భూపతిని ఉత్తమ కార్టూనిస్టుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్, తెలంగాణ కార్టూనిస్టుల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి జాకీర్ హుస్సేన్, వేముల రాజమౌలి, ఇతర సభ్యులు భూపతిని అభినందించారు. గతంలో తునికి భూపతి పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా భూపతిని పలువురు అభినందించారు.
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/tana-award-bhupathi.jpg)
Congratulations once again Bhupathi garu