80 స్థానాల్లో గెలుపే ల‌క్ష్యం: మాణికం ఠాగూర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 స్థానాల్లో గెలుపొంద‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ తెలిపారు. ఇవాళ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి నివాసం మ‌ణికం ఠాగూర్‌, ఏఐసిసి కార్య‌ద‌ర్శి బోస్ రాజు, కోమ‌టిరెడ్డితో స‌మావేశ‌మయ్యారు. అనంత‌రం మాణికం ఠాగూర్ మాట్లాడుతూ.. “తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఎప్ప‌డు అయినా రావ‌చ్చు.. దీనిపై లోతుగా చ‌ర్చించాం.. అలాగే సిరిసిల్ల‌లో ఏర్పాటు చేయ‌నున్న రాహుల్ గాంధీ స‌భ‌పైనా చ‌ర్చించాం.. అందరితో క‌లిసి ప‌నిచేస్తాం.. త్వ‌ర‌లో రాష్ట్రమంతా ప‌ర్య‌టిస్తాం…“ అని మాణికం ఠాగూర్ స్ప‌ష్టం చేశారు.

అనంత‌రం కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.. మాట్లాడుతూ.. “ నేను కాంగ్రెస్ పార్టీలో చురుకుగానే ఉన్నా.. అసంతృప్తిగా లేను.. మొద‌టి నుంచి పార్టీలో ఉండి కష్ట‌ప‌డ్డ వారికే టికెట్లు ఇవ్వాలి.. పార్టీ అధిష్ఠానాన్ని అదే కోరుతున్నా..“ అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.