బుయ్యారం శివారులో గుడుంబా తయారీ..

రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): రామగుండం కమీషనరేట్ మంచిర్యాల జోన్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుయ్యారం గ్రామ శివారు ప్రాంతం లో గుడుంబా తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు.. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ సిబ్బంది తో తనిఖీ నిర్వహించారు. అక్కడ గుడుంబా తయారీకి సిద్దంగా ఉంచిన సుమారు 4200 లీటర్ల ఉన్న బెల్లం పానకం గుర్తించి , దానిని ధ్వంసం చేశారు.