Medchal: వేధింపులు కారణంగా ఉపాధ్యాయుడు ఆత్మహత్య..!
మేడ్చల్ (CLiC2NEWS): మేడ్చల్లోని ఓ లాడ్జిలో ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత మంది వేధింపులు కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్పీ వీడియో తీసుకున్నాడు. మృతుడిని మెదక్ పట్టణానికి చెందిన కాముని రమేశ్గా గుర్తించారు. మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండలం సర్దన గ్రామంలో రమేశ్ ఎస్జిటిగా విధులు నిర్వహిస్తున్నాడు.
రమేశ్.. అప్పులు తీర్చేసినప్పటికీ ఇంకా బాకీ ఉన్నాడని కొందరు తనని వేధిస్తున్నారని, కోర్టులో చెక్ బౌన్స్ కేసులు వేసి మానసికంగా తనతో పాటు తన కుటుంబాన్ని వేధిస్తున్నారని వీడియోలో పేర్కొన్నాడు. తనను చంపే ప్రయత్నం కూడా చేశారని ఆరోపించాడు. వీటిని తట్టుకునే శక్తి, ఓపిక లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రమేశ్ వీడియోలో తెలిపాడు. తన భార్య, పిల్లలు రోడ్డున పడకుండా ముఖ్యమంత్రి , మెదక్ ఎమ్మెల్యే కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. తన మృతికి కారణమైన వారికి శిక్షించాలని కోరారు.