ఏలూరు జిల్లా చుదిమెల్లలో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య..
ఏలూరు (CLiC2NEWS): పుట్టిన రోజు మర్నాడే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. భార్య లేని లోకంలో ఉండలేనని భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా చుదిమెల్లలో చోటుచేసుకుంది. చుదిమెల్లలో చిన్ని సురేంద్ర, దేవిక దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు . వారికి ఇద్దరు కుమారులు. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన దేవిక ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఎంతకీ ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో సురేంద్ర ఇంటికి చేరుకొని చూసేసరికి తన భార్య ఉరేసుకొని ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. తన భార్య చనిపోవడంతో సురేంద్ర కాళ్లు, చేతులు కోసుకొని తానూ ఆత్మహత్యకు యత్నించాడు. దేవిక ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.