Telanganaలో కొవిడ్ వ్యాక్సిన్స్ పంపిణీకి డ్రోన్స్

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్స్ పంపిణీ కోసం డ్రోన్ల వినియోగానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఏడాదిపాటు అనుమతి అమలులో ఉండనుందని డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) పేర్కొంది. పౌరుల ఇంటి వద్దకే హెల్త్‌కేర్ సేవలు అందించడం, సేవల పంపిణీ నేపథ్యంలో కొవిడ్ -19 వ్యాప్తి చెందకుండా నియంత్రించడం దీని ప్రధాన ఉద్ధేశం. చివరి మైలు వరకు ఆరోగ్య సేవలు అందించడం కూడా డ్రోన్ సేవల లక్ష్యం.
డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీపై అధ్యయనం చేయాల్సిందిగా ఏప్రిల్ 22న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.