Telanganaలో మినీపుర పోరు ప్రారంభం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మినీ పుర‌పోరు ఎన్నిక‌ల పోలింగ్ మొద‌లైంది. వరంగల్ మ‌హాన‌గ‌ర‌పాల‌క సంస్థ‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటితోపాటు మెట్‌పల్లి, అలంపూర్‌, జల్‌పల్లి, గజ్వేల్‌, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

ఈ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇదులో 5,57,759 మంది పురుషులు, 5,76,037 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం మొత్తం 1539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 9809 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు.

రాష్ట్ర ఎన్నిల సంఘం గురువారం జిల్లా క‌లెక్ట‌ర్లు, పోలీసు క‌మిష‌న‌ర్లు, ఎస్సీలు, జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు, పుర‌పాల‌క క‌మిష‌న‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఎన్నిక‌ల ఏర్లాట్ల‌ను స‌మీక్షించింది. ఎన్నిక‌ల్లో హైకోర్టు ఉత్త‌ర్వుల‌కు అనుగుణంగా కొవిడ్ నిబంధ‌న‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సి. పార్థ‌సార‌థి ఆదేశించారు. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న‌వారు, ఓట‌ర్లు విధిగా మాస్కులు ధ‌రించాల‌న్నారు. శానిటైజ్ చేసుకోవాల‌న్నారు. పోలింగ్ కేంద్రం వెలుప‌ల‌, లోప‌ల భౌతిక దూరం పాటించాల‌న్నారు. అవాంఛనీయ సంఘనటనలు జరుగకుండా భారీ బందోబస్సు ఏర్పాటుచేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్‌, మాస్కులు, గ్లౌసులు అందుబాటులు ఉంచారు. మే 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.