Telangana: సినిమా థియేటర్లు బంద్‌

హైదరాబాద్‌: కరోనా ప్రభావం సినిమా థియేటర్లపైనా పడింది. వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో బుధ‌వారం నుంచి థియేటర్లను మూసివేయాలని తెలంగాణ థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై తెలంగాణ థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి విజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యుల సమావేశం జరిగింది. వకీల్‌ సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా మిగితా వాటిని మూసివేయాలని సమావేశంలో నిర్ణయించారు. కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు తెలిపారు.

అత్య‌వ‌స‌ర‌మైతేనే సినిమాల షూటింగ్‌

క‌రోనా పంజా విసురుతున్న వేళ తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప సినిమా చిత్రీక‌ర‌ణ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంది. ఈ మేర‌కు తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత మండ‌లి ఈ నిర్ణ‌యాల్ని వెల్ల‌డించింది.

1 Comment
  1. […] Telangana: సినిమా థియేటర్లు బంద్‌ […]

Leave A Reply

Your email address will not be published.