వ్యవసాయరంగం బలోపేతానికి తెలంగాణ సర్కార్ కృషి: మంత్రి హరీష్రావు
సిద్దిపేట (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం బలోపేతానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని ఆర్ధిక, వైద్య మంత్రి హరీష్రావు అన్నారు. చిన్నకోడూరు మండలం చందలాపూర్ లో 143 మంది రైతులకు ఇవాళ (బుధవారం) తుంపర సేద్య పరికరాలు, ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. గుజరాత్, ఎపి, మహారాష్ట్రలో కరెంటు కోతలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరెంటు కోతలు లేవన్నారు. రైతులు ఆరుతడి, వాణిజ్య పంటలు పండించి లాభాలు పొందాలని సూచించారు.
Feel free to surf to my web blog; adultvideochatrooms.Com