పెళ్లికి తీసుకెళ్తానని.. ఇద్దరు కుమార్తెలు సహా తండ్రి ఆత్మహత్య

జగిత్యాల (CLiC2NEWS): జిల్లాలోని నర్సింగాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లాలని ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో బయలుదేరి.. కుమార్తెలను వ్యవసాయ బావిలో తోసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, తెలిపిన వివరాల మేరకు.. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం జలపతి రావు, కవితకు ముగ్గురు ఆడపిల్లలు, జగిత్యాలలో పెళ్లికని చెప్పి తను ముగ్గురు పిల్లలతో వెళ్లాలని సిద్దమయ్యాడు. పెద్ద కుమార్తె రానంది. దీంతో మిగతా ఇద్దరు కుమార్తెలను తీసుకుని బయలుదేరాడు. ఆ రాత్రి తిరిగి ఇంటికి రాలేదు. మరుసటి రోజు ఉదయం నర్సింగాపూర్ శావారులో వ్యవసాయ బావి వద్ద జలపతి రావు మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పక్కనే ఉన్న వ్వవసాయ బావిలో కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఘటనా స్థలంలో జలపతిరావు జేబులో సూసైడ్ నోట్ లభించింది. నర్సింగాపూర్‌లోని ఓ కాలనీ ఏర్పాటులకు ప్రభుత్వం జలపతిరావు వ్వవసాయ భూమిని తీసుకుందని.. దానికి పరిహారం చెల్లించకపోవడంతో కేసు వేయగా ప్రభుత్వం రూ.45,95,516 కోర్టులో జమ చేసింది. ఆ డబ్బు ఇప్పించవలసినదిగా న్యాయవాది చుట్టూ కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నా.. ఆసొమ్ము అందకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.
[…] […]