నిజామాబాద్‌లో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి వేముల
నిజామాబాద్ (CLiC2NEWS): జిల్లా కేంద్రంలో పోలీసు ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం త్వరలో కల్పించనున్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కష్టపడి చదివతే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవవచ్చని తెలిపారు. ఫ్రీ కోచింగ్ కోసం మంత్రి తో పాటు ఆయన స్నేహితులు ఇచ్చిన 15 లక్షల రూపాయల చెక్కును నిజామాబాద్ సిపి నాగరాజుకి అందజేశారు. తన వంతు అదనపు సహకారంగా నిరుద్యోగుల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని ఆయన తెలిపారు. అందులో అన్ని రకాల పోటి పరీక్షలకు అవసరమయ్యే ఆన్‌లైన్ క్లాసులు పొందుపరిచామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, కలెక్లర్ నారాయణ రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.