మణిపుర్ ఘర్షణలు.. నగరానికి చేరుకున్న తెలంగాణ విద్యార్థులు..
హైదరాబాద్ (CLiC2NEWS): మణిపుర్‌లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తెలంగాణ వాసులు శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేక బస్సులలో వారి స్వస్థలాలకు పంపించారు. మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లు.. హింసాత్మక ఘర్షణ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వాసులను నగరానికి తీసుకురావలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఆదివారం సాయంత్రానికల్లా వారిని తీసుకురావాలని నిర్ణయించారు. కానీ అక్కడి పరిస్థితులు అనుకూలించక సోమవారం వారిని సురక్షితంగా తీసుకువచ్చారు. విద్యార్థులతో పాటు రాష్ట్రానికి చెందిన వారు సుమారు 250 మంది ఉన్నారు.
మణిపుర్‌లో ఘర్షణలు.. తెలంగాణ విద్యార్థులను తీసుకురావాలని ప్రభుత్వ నిర్ణయం