రాష్ట్రంలో జూన్ 12 న టెట్ ఎగ్జామ్.. నోటిఫికేషన్ విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2022/03/EXAM.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే టెట్ పరీక్షకు ఆన్‌లైన్‌లో ఈ నెల 26వ తేదీనుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్ 12వ తేదీన టెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈపరీక్షను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. టెట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
2015 డిసెంబర్ 23న టెట్‌కు సంబంధించి జారీ చేసిన జిఓ 36లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జిఓ 8 తెచ్చింది. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఎన్‌సిటిఈ) మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులు చేవారు. పాఠశాల విద్యాశాకలో 13,086 కొలువులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 10 వేల వరకు ఉపాధ్యాయ కొలువులు ఉన్నాయి. అందులో ఎస్‌జిటి ఉద్యాగాలు 6,700 వరకు ఉంటాయి. ఆదర్శ పాఠశాలల ఖాళీలు కలిపి 11వేల వరకు ఉంటాయని తెలుస్తోంది.