Immunity Booster: బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్

ప్రియమైన సోదర సోదరిమణులకు హృదయపూర్వక కొత్త సంవత్సర శుభాకాంక్షలు. దరిదాపు ఒక సంవత్సరం నుండి నేను CLiC2NEWS ద్వారా హెల్త్ టిప్స్ అందరికి అందిస్తున్నాను. నా హెల్త్ టిప్స్ కి చాలా మంచి ఆదరణ లభిస్తుంది. దీనికి గాను నేను మీఅందరికి ఎల్లప్పుడు రుణపడి వుంటాను. కరోనా వైరస్ వచ్చిన వారికీ ఆహారనియమాలు, ఆయుర్వేద మందులు, మరియు శారీరక వ్యాయామం గురించి చెప్పటం జరిగింది. మరియు కరోనా వైరస్ రాకుండా నివారణ మార్గాలు, మరియు కరోనా వైరస్ వచ్చిపోయిన వారికీ ఎలా ఉండాలి. ఏ ఏ ఆహారాలు తినాలి. ఫీజికల్ exercises మరియు చిన్న చిన్న గృహ చికిత్సలు అంద‌జేశాము. వాటిని పాటించి నాకు చాలా మంది phone చేసి ధన్యవాదములు తెలిపినారు. ఎంతో మందికి ఒకే ఇంట్లో 12 మందికి 5 గురుకి కూడా కరోనా వైరస్ వచ్చింది. వారందరిని నేను నాకు తెలిసిన ఆయుర్వేద, మరియు ఆహారనియమాల ద్వారా మ‌హ‌మ్మారిని ఎదుర్కోడానికి తోడ్ప‌డ్డాను. మేము అంద‌జేసిన సూచ‌న‌లు, టిప్స్ పాటించి వారందరు ఇప్పుడు సంతోషంగా వున్నారు.

ఇప్పుడు మరల ఓమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ కొత్త వేరియంట్‌తో ప్ర‌పంచ దేశాలు భయబ్రాంతుల‌కు గుర‌వుతున్నాయి. మనమందరం భయపడవలసిన అవసరం లేదు.

భారతదేశం ఆయుర్వేద బండాగారం, మన దగ్గర వున్న ఆయుర్వేద చెట్లతో చక్కగా వాడుకుంటూ వైరస్ ని భారతీయుల దగ్గరికి కూడా రాకుండా చేయగల సత్తా వున్న బ్రహ్మమాండమైన ఆయుర్వేద కాషాయం మీకు బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది.
దీనిని వాడితే శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా వుంటారు.

పవర్ ఫుల్ ఇమ్మ్యూనిటి బూస్టర్ ఓమిక్రాన్ వెరియంట్ రాకుండా ముందు జాగ్రత్తగా ఈ కాషాయం తాగాలి. దీనిని తయారుచేయు విధానం.

గిలోవ్ దీనిని తెలుగులో తిప్పతీగ అంటారు. చక్కని ఇమ్మ్యూనిటిని పెంచే గుణం వుంది. ఆయుర్వేద వైద్యం ప్రకారం తిప్పతీగలో ఆకులు, బేరడు, వేరు దీనిలో అన్ని బాగాలలో ఔషద గుణాలు పుష్కలంగా వున్నాయి. దీని కాషాయం తాగితే శరీరంలో ప్రతి భాగం ఇమ్మ్యూనిటి పవర్ ని పెంచుకుంటుంది. వ్యాధినిరోధక శక్తి చక్కగా పెరిగి ఎటువంటి వైరస్ వ్యాధినైనా రాకుండా కట్టడి చేస్తుంది. మరియు వచ్చిన వైరస్ వ్యాధిని తగ్గించటానికి చక్కగా పనిచేస్తుంది.

కాషాయం

1. తిప్పతీగ 5 ఇంచెస్ చిన్న ముక్కలు

2. వేపాకులు 5

3. తులసి ఆకులు 10

4. తాటి బెల్లం తగినంత

పైవన్నీ తీసుకోవాలి.

1 తిప్పతీగ ముక్కలు గిన్నెలో వేయండి.

2. మరియు దానిలో నాలుగు కప్పులు నీరు వేయండి.

3. స్టవ్ మీద ఎక్కించి సిం మీద పెట్టండి.20 నిముషాలు ఉడికించండి.

4.ఉడికించేటపుడు వేపాకులు వేయండి

5. తులసి ఆకులు కూడా కలపండి. మరియు బెల్లం కూడా దానిలో వేయండి.

6. దీనిని రెండు కప్పులు అయ్యేవరకు మరిగించి స్టవ్ మీద నుండి దించాలి. తరువాత దానిని వడపోసి తాగాలి.

7. జలుబు, జ్వరం, దగ్గు, రోగాలు వెంటనే తగ్గుతాయి.

ఆయుర్వేదంలో తిప్పతీగ best మెడిసిన్. దీనిని అమృతవల్లి, అంటారు. ఇది ఎల్లపుడు ఎండిపోదని అర్ధం. సున్నితంగా తమలపాకుల ఆకారంలో ఉంటుంది. గింజలు బఠాణి గింజల ఆకారంలో ఉంటాయి. తిప్పతీగ ఏదైనా చెట్టుకి పాకిస్తే ఆ చెట్టు యొక్క గుణాలు కూడా గ్రహిస్తుంది. తిప్పతీగ సర్వశ్రేష్ఠమైనది గా చెప్పబడును.

ఆచార్య చరకుడు దీనిలో వయస్థాపన, దాహప్రశమనస, తృష్ణనిగ్రహణ, స్థన్యశోద, మొదలైన గుణాల్ని, ప్రతిపదించగా, ఆచార్య సుశృతుడు గడుచ్యాధి, బల్లివంచమూల, మొదలైన సమూహంలో దీన్ని చేర్చాడు.

ఇది త్రిదోషాత్మకం, స్నిగ్ధంగా ఉండటం వలన వాత దోషాల్ని, తిక్త, కాషాయ రుచుల వల్ల కఫ, పిత్తాలను ఉపశమనం చేస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

తిప్పతీగ కాడ వలన కలిగే ప్రయోజనాలు

1.దీని కాడ ప్రతిరోజు తాగటం వలన సంక్రమణ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

2. తిప్పతీగ కాడ తాగటం వలన రోగనిరోధక పెరుగుతుంది.

3. షుగర్ ని తగ్గించటానికి చక్కగా తిప్పతీగ ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ని కంట్రోల్ లో పెడుతుంది.

4. డెంగీ, జ్వరంలో ప్లేట్లెట్స్ పెంచటానికి తిప్పతీగ బాగా పనిచేస్తుంది.

5. నొప్పులు కూడా తగ్గుతాయి.

వేపాకు గురించి.ఇది భారతదేశంలో అన్ని ప్రాంతాలలో పెరుగుతుంది. ఇందులో చాలా ఔషద గుణాలు వున్నాయి. వేప యాంటి బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంది. వేప పచ్చడి తింటే కడుపులో క్రిములను చంపుతుంది.

వేపపట్ట కాషాయం తాగితే విషమ జ్వరాలు తగ్గుతాయి.

తులసి చెట్టు గురించి.. తులసి చెట్టు అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది. దీనిని పూజలు కూడా చేస్తారు. దీనిలో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు వున్నాయి.వైరస్తో వచ్చే జబ్బులను, జ్వరాలు, టైఫాయిడ్, లాంటివి దీని ఆకుల రసం తాగితే చాలు వెంటనే తగ్గుతాయి.

 

-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.