మండ‌పేట‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఘ‌నంగా తెలుగు భాషా దినోత్సవం

మండపేట (CLiC2NEWS): మండ‌పేట ప‌ట్ట‌ణంలో తెలుగు భాషా దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యాలయం వద్ద ఆదివారం తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి, తెలుగుతల్లి చిత్ర పటం ఏర్పాటు చేసి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోన సత్యనారాయణ మాట్లాడుతూ… తెలుగు భాష పరిరక్షణకు కృషి చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని అన్నారు. తెలుగు భాష ఉన్నతికి పాటుపడిన గిడుగు పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం అన్నారు. ప్రపంచ స్థాయిలో కూడా తెలుగుకు ఎంతో ఘన కీర్తి ఉందని అన్నారు. అమెరికా వంటి అగ్రరాజ్యంలో ప్రతి ఏటా తానా సభలు పేరుతో తెలుగు భాషా దినోత్సవాలు జరపడం తెలుగు భాషకు ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతుంది అన్నారు. కానీ, మన రాష్ట్రంలోనే తెలుగు భాషను ప్రభుత్వం గుర్తించక పోవడం దురదృష్టకరం అన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ తెలుగును ద్వితీయ స్థానంలోకి నెట్టేయడం బాధాకరంగా ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని కార్యకలాపాలు తెలుగులోనే జరిగేలా చర్యలు తీసుకుని తెలుగు వినియోగం పెంచితే మంచిది అన్నారు. కార్యక్రమంలో యువమోర్చ జిల్లాకార్యదర్శి నాళం ఫణిప్రకాష్, జిల్లా ఎస్సీ మోర్చ కార్యదర్శి పెదపాటి వసంత, చెన్నా వీరరాఘవయ్య, పాలిక రమణ, బుద్ధవరపు సత్తిబాబు, బుద్ధవరపు రత్నరాజు, మొల్లేటి శివకుమార్, పోతాబత్తుల ప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.