Mandapetea: న్యాయం జరిగేలా చూస్తా..: ఎమ్మెల్సీ తోట‌

మండపేట (CLiC2NEWS): క్వాలిఫైడ్ టీచర్స్ కు న్యాయం జరిగేలా చూస్తా న‌ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను హీ ఇచ్చారు. ఈ మేర‌కు ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయించాలని కోరుతూ 1998 క్వాలిఫై టీచర్స్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను అభ్యర్థించారు. క్వాలిఫైడ్ టీచర్స్ యూనియన్ నాయకులు రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలోని త్రిమూర్తులను కలిసి తమ సమస్య విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని శాలువాతో సన్మానించి సత్కరించారు. టీచర్స్ అభ్యర్ధనపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. క్వాలిఫైడ్ టీచర్స్ కోటిపల్లి రాంబాబు, ఖండవిల్లి అబ్బూరావు, టివివి సత్యనారాయణ, టి భాస్కరరావు, వెంకట్రావు, బ్రహ్మం తదితరులు ఎమ్మెల్సీని కలిసిన వారిలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.