తోడికోడ‌ళ్ల హ‌త్య‌కేసు.. క‌ట్టుకున్న‌వారే కడ‌తేర్చారా..

ఓర్వ‌క‌ల్లు (CLiC2NEWS): ఎపిలో క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు మండ‌లం స‌మీపంలో జ‌రిగిన‌ తోడికోడ‌ళ్ల హ‌త్య కేసులో పోలీసులు నిందుల‌ను గుర్తించిన‌ట్లు స‌మాచారం. ఘ‌ట‌నా స్థ‌లంలో దొరికిన చెప్పు ఆధారంగా క‌ట్టుకున్న భ‌ర్త‌లే తండ్రి స‌హాయంతో వారిని హ‌త్య‌చేసిన‌ట్లు గుర్తించారు. ఓర్వ‌క‌ల్లు మండ‌లం న‌న్నూరుకు చెందిన పెద్ద రామ‌గోవిందు, చిన్న రామ‌గోవిందు అన్నద‌మ్ములు. వీరిలో పెద్ద గోవిందుకు ఐదేళ్ల కింద‌ట‌ వివాహం జ‌ర‌గ‌గా.. చిన్న‌గోవిందుకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే
వీరికి సంతానం లేక‌పోవ‌డంతో మామ గోగ‌న్న వీరిని హ‌త‌మార్చి కుమారుల‌కు మ‌ళ్ళీ పెళ్లి చేయ‌ల‌నే ఉద్దేశ్యంతో ఈ జంట హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. కోడ‌ళ్లు ఇద్దురూ త‌న‌కు నాటు మందు పెట్టి హ‌త్య‌చేయాల‌ను కున్నార‌నే అనుమానంతో త‌న ఇద్దరు కుమారుల‌తో క‌లిసి వారిని హ‌త్య‌చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం.

మామ గోగ‌న్న కోడ‌ళ్ల‌తో క‌లిసి బుధ‌వారం త‌మ సొంత పొలంలో ప‌నులు చేయ‌డానికి వెళ్లారు. వీరితోపాటు పెద్ద‌కుమారుడు కూడా వెళ్లాడు. ప‌శువుల‌కు మేత కోసుకుర‌మ్మ‌ని కోడ‌ళ్ల‌ను గోగ‌న్న వేరే వారి పొలంలోకి పంపాడు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో వారిపై ముగ్గురు క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. ఇద్ద‌రికీ బ‌ల‌మైన దెబ్బ‌లు త‌గ‌లడంతో వారు అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం.

1 Comment
  1. zoritoler imol says

    Thank you for sharing with us, I believe this website really stands out : D.

Your email address will not be published.