కాకినాడలో ఎన్టిఆర్ విగ్రహం తొలిగింపు యత్నం.. నెలకొన్న ఉద్రక్తత

కాకినాడ (CLiC2NEWS): కాకినాడలో నిన్న రాత్రి ఎన్టిఆర్ విగ్రహం తొలగించేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంతచెరువు సెంటర్ దుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న ఎన్టిఆర్ విగ్రహాన్ని వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనుచరులే తొలగించేందుకు ప్రయత్నించగా టిడిపి శ్రేణులు అడ్డుకుని..ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ ఆర్సిపి శ్రేణులు సైతం ఆ ప్రాంతంలో నినాదాలు చేపట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అమ్మవారి గుడికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా సరే విగ్రహం తొలగించేందుకు కుట్ర పన్నారని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.