‘కోన‌సీమ’ జిల్లా పేరు మార్పు.. అమలాపురంలో ఉద్రిక్త‌త‌

అమ‌లాపురం (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ‘కోన‌సీమ’ జిల్లా పేరు మార్పు చేయెద్దంటూ ఆ ప్రాంత యువ‌కులు చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. కోన‌సీమ జిల్లాకు ఇటీవ‌ల ‘డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కోన‌సీమ’ జిల్లా గా మారుస్తూ రెవెన్యూ శాఖ ప్రాథ‌మిక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. దీనిపై అభ్యంత‌రాలు, సూచ‌న‌ల‌ను 30 రోజుల్లోగా క‌లెక్ట‌ర్‌కు తెలియ‌జేయాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఈ నేప‌థ్యంలో ‘కోన‌సీమ’ పేరునే కొన‌సాగించాలంటూ యువ‌కులు ఆందోళ‌న చేప‌ట్టారు. కోన‌సీమ జిల్లా సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో వంద‌లాది మంది యువ‌కులు అమాలాపురంలోని  గ‌డియారం స్తంభం సెంట‌ర్‌లో ఆందోళ‌న‌కు దిగారు. కోన‌సీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వ‌ద్దు అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. పోలీసులు నిర‌స‌న‌కారులను చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్బంలో ఆందోళ‌న‌కారులు పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో కొంత‌మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు.

Leave A Reply

Your email address will not be published.