భీమవరం: వైద్యుడి నుండి రూ.72 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..

భీమవరం (CLiC2NEWS): సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ప్లాన్‌లతో డబ్బులు కాజూస్తూ ఉన్నారు. తాజాగా ఓ వైద్యుడి నుండి రూ.75 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. వైద్యుడికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తమను తాము సైబర్ పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. మీ పేరున ముంబయి నుండి వచ్చిన పార్శల్లో 5 పాస్‌పోర్టులు, ఎటిఎం కార్డులు, డ్రగ్స్ ఉన్నట్లు కొరియర్ సంస్థ నుండి సమాచారం అందిందని.. విచారణ నిమిత్తం పూర్తి వివరాలు అడిగారు. వారు అధికారులేనని నమ్మిన బాధితుడు.. ఖాతాల నంబర్లు చెప్పారు. ఆ ఖాతాల్లో ఉన్న రూ. 72 లక్షలు ఉన్నాయని, తాము చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని సూచించారు. ఎందుకని వైద్యుడు ప్రశ్నించగా ఇంత సొమ్ము నీకుఎలా వచ్చిందో సరిచూడాలని, మరల తిరిగి నీ ఖాతాలో జమచేస్తామని నమ్మించారు. తరువాత నగదు ఎంతకీ తిరిగి రాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.