మత్స్యకారుల కుటుంబాల‌కు రూ. 161 కోట్ల నిధులు విడుద‌ల: సిఎం జ‌గ‌న్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపి సిఎం క్యాంపు కార్యాల‌యం నుండి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌త్స్య‌కారుల కుటుంబాల‌కు నిధులు విడుద‌ల చేశారు. ఓఎన్‌జిసి పైపులైన్ నిర్మాణం వ‌ల్ల న‌ష్ట‌పోతున్న మ‌త్స్యాకారుల‌కు రూ. 161.86 కోట్లు వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో విడుద‌ల చేశారు. ఒఎన్‌జిసి పైపులైన్ నిర్మాణం వలన ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో, అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాల్లో 16,048 మంది మ‌త్స్య‌కారుల కుటుంబాల‌కు, కాకినాడ జిల్లాలోని 7,050 మంది కుటుబాల‌కు క‌లిపి మొత్తంగా 23,458 మ‌త్స్య‌కారుల కుటుంబాల‌కు క‌లిగే న‌ష్టాన్ని భ‌ర్తీ చేస్తున్నామ‌ని సిఎం జ‌గ‌న్ తెలిపారు. నెల‌కు రూ. 11,500 చొప్పున ఇప్ప‌టి వ‌ర‌కు 3 విడ‌త‌లుగా 323 కోట్లు న‌ష్టప‌రిహారం చెల్లించిన‌ట్లు తెలిపారు. 4 విడ‌త‌లో జ‌న‌వ‌రి నుండి జూన్ వ‌ర‌కు 6 నెల‌ల‌కు స‌రిప‌డా రూ.జ 161 కోట్లు ప‌రిహారం నేరుగా వారి ఖాతాల్లో జ‌మ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఒఎన్‌జిసి పైపులైన్ త్ర‌వ్వాకాల ద్వారా జీవ‌నోపాధి కోల్పోయిన మ‌త్స్యకారుల‌కు సిఎం నిధులు విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మం సూళ్లూరుపేట‌లో జ‌రుపాల‌ని ముందుగా నిర్ణ‌యించారు. కానీ వ‌ర్షాల వ‌ల్ల ఆ కార్య‌క్ర‌మం వాయిదాప‌డింది. అయితే చేయాల‌ను ఆర్థిక సాయం ఆగిపోకూడ‌ద‌నే ఉద్దేశ్యంతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిధులు విడుద‌ల చేసిన‌ట్లు స‌మాచారం.

అదే విధంగా విశాఖ‌ప‌ట్ట‌ణంలో అగ్నికి ఆహుతైన‌ 40 బోట్లు.. ఘ‌ట‌న‌లో మ‌త్స్య‌కారుల కుటుంబాల‌ను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బోటు విలువ లెక్క‌గ‌ట్టి, దానిలో 80 శాతం ప్ర‌భుత్వ‌మే ఇచ్చేట‌ట్లుగా జారీ చేసిన ఆదేశాలు ప్ర‌కారం.. ఈ రోజే ఆ చెక్కుల పంపిణీ జ‌ర‌గాల‌ని మంత్రుల‌ను, అధికారుల‌ను సిఎం ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.