ప్రేమ‌జంట‌ను బెదిరించి.. యువ‌తిపై హోంగార్డు అత్యాచారం

నెల్లిమ‌ర్ల (CLiC2NEWS): విజ‌య‌న‌గ‌రం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. జిల్లాలోని నెల్లిమ‌ర్ల మండ‌లంలో ఓ యువ‌తిపై హోంగార్డు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు .. బొండ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తించే హోంగార్డు ప్రేమ‌జంట‌ను బెదిరించాడు. తాను ఎస్ఐని అని చెప్ప‌గా.. ప్రియుడు అక్క‌డినుండి పారిపోయాడు. దీంతో హోంగార్డు యువ‌తిని సొంత‌రూళ్లే బ‌స్సు ఎక్కిస్తాన‌ని చెప్పి త‌న బైక్‌పై ఎక్కించుకొని వెళ్లాడు. రామ‌తీర్థం స‌మీపంలోని చంపావ‌తి న‌ది ఒడ్డ‌న ఉన్న‌ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంత‌రం బాధితురాలిని బెదిరించి వెళిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు హోంగార్డును అరెస్టు చేసిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.