బుట్ట క‌మలాలు చూసారా..

క‌డియం (CLiC2NEWS):  బంగారు వ‌ర్ణంలో ఉండే బుట్ట క‌మ‌లాలు క‌డియం న‌ర్స‌రీలో చూప‌రులను క‌ట్టిప‌డేస్తున్నాయి. మొక్క నిండా పండ్ల‌తో ఎంతో ఆకర్ష‌ణీయంగా క‌నిసిస్తున్నాయి. ఇవి చైనా నుండి ఇటీవ‌ల తూర్పు గోదావ‌రి జిల్లా క‌డియం న‌ర్స‌రీకి వ‌చ్చాయి. మొక్క నిండా దాదాపు 100 నుండి 200 వ‌ర‌కు క‌మ‌లా పండ్లు ఉన్నాయి. ఇవి నెల రోజుల పాటు మొక్క‌ను అంటిపెట్ట‌కుని ఉంటాయ‌ట‌. ఈ మెక్క‌ల‌ను చూసేందుకు చుట్టుప‌క్క‌ల వారు వ‌స్తున్నారు. మొక్క ఆరోగ్యం, వాటి ఎత్తును బ‌ట్టి బుట్ట క‌మ‌లాల ధ‌ర రూ.వెయ్యి నుండి రూ. 6వేల‌కు వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.