గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో లైంగిక వేధింపుల కలకలం

గుంటూరు (CLiC2NEWS): ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా కోర్సు చేస్తున్న విద్యార్థినులు.. శిక్షణలో భాగంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో (జిజిహెచ్)లో విధులు నిర్విస్తున్నారు. వీరి పట్ల బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ , లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత విద్యార్తినులు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. కాళాశాల ప్రిన్సిపాల్ ముగ్గురు అధికారులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటి ఇచ్చే నివేదిక ఆధారంగా బ్లడ్ బ్యాంక్ ఉద్యోగిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.