రేపు అహోబిలంలో దర్శనాలు నిలిపివేత
ఆళ్లగడ్డ (CLiC2NEWS): అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపు దర్శనాలను నిలిపివేయనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు ఆలయ సిఎఒ రామానుజన్ ప్రకటనలో తెలిపారు. ప్రసిద్ద పుణ్య క్షేత్రం అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 20 వ తేదీ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు దేవాలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయనున్నారు. ఆలయ గర్భగుడిలో సుగంద ద్రవ్యాలతో శుద్ధి కార్యక్రమం ఉంటుంది. దీని వలన దర్శనాలు నిలిపివేస్తున్నట్లు సిఎఒ పేర్కొన్నారు.