ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదన్న సజ్జల

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల పేరుతో కొన్ని మీడియా ఛానెళ్లు హడావుడి చేస్తున్నారన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోందని.. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహనరెడ్డినే కోరుకుంటున్నారన్నారు. సిఎం పూర్తిగా పాజిటివ్ ఓటునే నమ్ముకున్నారన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయిని.. ప్రజలకు మాపై విశ్వాసం ఉందన్నారు. నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైఎస్ ఆర్ సిపికి అనుకూలంగా వచ్చిందని తెలియజేశారు.