విశాఖపట్నం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విశాఖ (CLiC2NEWS): విశాఖపట్టణం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎపి గవర్నర్, డిప్యూటి సిఎం స్వాగతం పలికారు. విశాఖ తీరంలో రేపు అంతర్జాతీయ యుద్దనౌకల సమీక్ష – 2026 జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగాకు వచ్చిన రాష్ట్రపతికి ఎపి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. వీరితో పాటు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపి శ్రీ భరత్, మేయర్ పీలా శ్రీనివాస్, తదితర ఉన్నతాధికారులు సైతం ఉన్నారు.
విశాఖ తీరంలో రేపు అనగా 18వ తేదీన అంతర్జాతీయ యుద్దనౌకల సమీక్ష-2026 జరుగుతుంది. 19వ తేదీన మిలాన్, ఇంటర్నేషనల్ సిటి పరేడ్, 20న ఐయాన్ కానైవ్ ఆఫ్ చీప్స్ కార్యక్రమాలు జరగున్నాయి.