ఎల్లుండి మే నెల‌ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల టికెట్ల విడుద‌ల‌

తిరుమ‌ల‌ (CLiC2NEWS): మే నెల‌కు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల టికెట్ల‌ను బుధ‌వారం విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు టిటిడి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న సేవ కు సంబంధించి ఎల‌క్ట్రానిక్ డిప్‌లో పేర్ల న‌మోదు ఈ నెల 18వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుండి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు టిటిడి ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంత‌రం డిప్‌లో ఎంపిక చేస్తారు. డిప్‌లో ఇ-టికెట్లు పొందిన వారు ఫిబ్ర‌వ‌రి 20 నుండి 22 వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోపు న‌గ‌దు చెల్లించిన అనంత‌రం టికెట్లు మంజూరు అవుతాయి.

21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర దీపాలంకార సేవా టికెట్లు విడుద‌ల చేస్తారు.

21వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌లు, వాటి ద‌ర్వ‌న స్లాట్ల‌కు సంబంధించిన టికెట్లు విడుద‌ల చేస్తారు.

23వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు అంగ‌ప్ర‌ద‌క్షిణ టోకెన్ల కోటాను విడుద‌ల చేస్తారు.

23 ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ల కోటా విడుద‌ల‌

23 మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధిగ్ర‌స్థులు, దివ్యాంగుల‌కు ఉచిత ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టోకెన్ల కోటా విడుద‌ల ఉంటుంది.

24వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ‌ ద‌ర్శ‌నం టికెట్ల కోటా విడ‌ద‌ల చేయ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తిరుమ‌ల‌, తిరుప‌తిలో అద్దె గ‌దుల బుకింగ్ కోటాను విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ నెల 27 వ తేదీ మ‌ధ్యాహ‌నం 3గంట‌ల‌కు శ్రీ‌వారి సేవ‌, ప‌ర‌కామ‌ణి సేవా కోటాను విడుద‌ల చేస్తారు. టిటిడి అధికారిక వెబ్‌సైట్‌లో మాత్ర‌మే టికెట్లు బుక్ చేసుకోవాల‌ని అధికారులు సూచించారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.