అమెరికాలో ఇంజినీరింగ్ చదివేందుకు 2.4కోట్ల స్కాలర్‌షిప్‌తో అవకాశం పొందిన విద్యార్థి

విజయవాడ (CLiC2NEWS): నగరానికి చెందిన ఓ విద్యార్థికి అమెరికాలో ఇంజినీరింగ్ చదివేందుకు ఏకంగా రూ.2.4 కోట్ల స్కాలర్‌షిప్‌తో అవకాశం లభించింది. మిరియాల ఆదిత్య అనే విద్యార్థికి ఈ అరుదైన అవకాశం వరించింది. ఇన్విక్టా కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అమెరికాలోని మిల్వాకా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్స్ చదివేందుకు ఎంపికయ్యాడు. ఇన్విక్టా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానందమూర్తి , డైరెక్టర్ కృష్ణమోహన్ , శారదా జూనియర్ కాలేజ్ డైరెక్టర్ విద్యార్థిని అభినందించారు.