విద్యార్థుల కోరిక మేర‌కు బ‌స్సు సౌక‌ర్యం.. మంత్రి ఎర్ర‌బెల్లి

జనగామ (CLiC2NEWS): ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రామ‌రాజుప‌ల్లి విద్యార్థుల‌కు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించారు.

రామరాజుపల్లికి వ‌చ్చిన మంత్రిని విద్యార్థులు కలిసి తమ గ్రామానికి బస్సు సర్వీస్ ను ఏర్పాటు చేయాలని కోర‌గా.. వెంటనే చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడమే గాక, ఆర్టీసీ అధికారులను ఆదేశించి బస్ సర్వీస్ సౌక‌ర్యం కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి శుక్రవారం రామరాజుపల్లి కి విచ్చేసి బస్ సర్వీస్ ను ప్రారంభించారు. దీంతో విద్యార్థులంద‌రూ సంతోషంతో మంత్రికి కృత‌జ్ఞ‌లు తెలియజేశారు. మంత్రితో పాటు బస్ ఎక్కి త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇచ్చిన మాట త‌ప్పేదే లేదని ప్రజలు కూడా సహకరించి విద్యార్థులను ప్రభుత్వ బడులకే పంపాలని, తద్వారా విద్యార్థులకు నాణ్యత విద్యతో పాటు, తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గనున్నదన్నారు.

Leave A Reply

Your email address will not be published.