స్వ‌చ్చందంగా పసిడి, వెండి త‌న‌ఖాకు బ్యాంకులు అంగీక‌రించొచ్చు..

RBI: రైతులు రూ.2ల‌క్ష‌ల లోపు రుణాల‌పై బంగారం, వెండిని స్వ‌చ్చందంగా త‌న‌ఖా పెడితే.. బ్యాంకులు అంగీక‌రించ‌వ‌చ్చ‌ని ఆర్‌బిఐ స్ప‌ష్టం చేసింది. అంతేగాని.. వాళ్ల‌పై బ్యాంకులు ఎటువంటి ఒత్తిడి చేయ‌కూడ‌ద‌ని తెలిపింది. రైతుల‌కు వ్య‌వ‌సాయం, ఎంఎస్ ఎమ్ ఇ.. హామీ ర‌హిత రుణం రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు బ్యాంకులు మంజూరు చేయ‌వ‌చ్చు. ఈ రుణ ప‌రిమితి 2024 డిసెంబ‌ర్‌లో రూ.1.6 ల‌క్ష‌ల నుండి రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్‌బిఐ పెంచింది. హామీ ర‌హిత రుణాలు పొందే అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ .. త‌మ‌కు ఇష్ట‌మైతా ప‌సిడి, వెండిని హామీ కింద రుణ గ్ర‌హీత‌లు త‌న‌ఖా పెట్ట‌వ‌చ్చ‌ని ఆర్‌బిఐ తాజాగా తెలిపింది. అయితే పసిడి, వెండిని రుణ గ్ర‌హీత‌లు త‌న‌ఖా పెట్ట‌డం పూర్తిగా స్వ‌చ్చందంగా జ‌ర‌గాల‌ని స్ప‌ష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.