వానాకాలంలో మొక్క‌జొన్న పొత్తులు

 

తొల‌క‌రి జ‌ల్లుల్లో త‌డుస్తూ కాల్చిన మొక్క‌జొన్న కంకుల‌ను తింటుంటే ఎంతో బావుంటుంది కదా.. అలాంటి మొక్క‌జొన్న గింజ‌ల‌లో ఎన్నో పోష‌కాలు ఉన్నాయ‌ని తెలుసా..

మొక్క‌జొన్న గింజ‌ల‌లో పీచు ఎక్క‌వ‌గా ఉండ‌టం వ‌ల‌న మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ‌ల‌న కంటి చూపు మెరుగుప‌డుతుంద‌ని నిపుణ‌ల చెబుతున్నారు.
మొక్క‌జొన్న గింజ‌లు తిన్న‌పుడు పొట్ట ఉబ్బిన‌ట్లు ఉంటుంది. పీచు ప్రిబ‌యాటిక్‌గా ప‌నిచేసి.. పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ది చెంద‌డానికి దోహ‌దప‌డుతుంది. దీర్ఘ‌కాలంగా ఉంటున్న వాపులు, గుండె జ‌బ్బు, క్యాన్స‌ర్ల వంటి వాటికి దారితీసే క‌ణాల బారి నుండి యాంటీ ఆక్సిడెంట్లు కాపాడ‌తాయంటున్నారు. వానాకాలంలో వ‌చ్చే వైర‌ల్, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్‌ల పోరాటంలో కూడా ఇవి స‌హ‌క‌రిస్తాయి.

గింజ‌లు స‌హ‌జంగా తీపిగా ఉంటాయి. కానీ వీటిలో చ‌క్కెర స్థాయి త‌క్కువ‌గానే ఉంటుంది. ఒక మొక్క‌జొన్న పొత్తులో సుమారు 4 గ్రాముల స‌హ‌జ చ‌క్కెర ఉంటుంది. ఇది ఒక యాపిల్ ఉండే చ‌క్కెరకు నాలుగ‌వ వంతు మాత్ర‌మే. వీటిలో చాలా విట‌మిన్లు, పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. కొలెస్ట్ర‌ల్ అస‌లు ఉండదు.

Leave A Reply

Your email address will not be published.