గ్రీన్ టీ.. ఎప్పుడు తీసుకుంటే మంచిది..

Green Tea: ప్ర‌స్తుత కాలంలో ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూప‌ని వారుండ‌రు అనడంలో అతిశ‌యోక్తి లేదు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. ఆహారం విష‌యంలో, వ్యాయామం, అందం ఇలా ప్ర‌తి విష‌యంలో త‌మకు తెలిసిన నియ‌మాలు పాటిస్తూ.. లేదా నిపుణుల స‌ల‌హాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకుంటున్నారు.
మ‌నం ప్ర‌తి రోజు టీ తాగనిదే ప‌నులు ప్రారంభించం.  బ్లాక్ టీ, లెమ‌న్ టీ, గ్రీన్ టీ.. ఇలా ఎన్నో ర‌కాల టీలు తాగుతుంటారు. టీ లు ఎన్ని ర‌కాలున్నా కానీ ఇటీవ‌ల కాలంలో గ్రీన్ టీ ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. సెల‌బ్రెటీల నుండి డైటీషియ‌న్ల వ‌ర‌కు చాలామంది గ్రీన్ టీ రోజూ తీసుకుంటున్నారు.

అధికంగా బరువు క‌లిగిఉన్న వారు సులువుగా బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు ముందుగా గ్రీన్‌టీ ఉప‌యోగిస్తున్నారు. దీనిలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు బ‌రువుని త‌గ్గించ‌మే కాకుండా మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌స్తుత రోజుల్లో గ్రీన్ టీని ప్ర‌తి రోజు తీసుకుంటున్నారు. యాంటి ఆక్సిడెంట్లు మెద‌డు ప‌నితీరుని మెరుగుప‌రుస్తుంది. జీవ‌క్రియ వేగం పెంచుతుంది. క్రొవ్వు క‌రిగి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. గుండె జ‌బ్బుల్ని త‌గ్గిస్తాయి.

ఇన్ని గుణాలున్న గ్రీన్ టీ .. స‌రైన స‌మ‌యంలో తాగితేనే స‌రైన ఫ‌లితాలు పొంద‌వ‌చ్చంటున్నారు నిపుణులు. అది ఎప్పుడంటే.. రోజు ప్రారంభ‌మైన‌పుడు తీసుకోవాలి. దీంతో శ‌రీరానికి కావాల్సిన శ‌క్తిని అందించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
వ్యాయామానికి ముందు గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. కొంత మంది వ్యాయామం చేసిన త‌ర్వాత తాగుతారు. కానీ.. ముందు తీసుకుని వ్యాయామం చేయాలి. గ్రీన్ టీ తాగిన త‌ర్వాత క‌స‌ర‌త్తులు చేస్తే ఎక్కువ మోతాదులో కొవ్వు క‌రుగుతుంద‌ట‌.

భోజ‌నం త‌ర్వాత గ్రీన్ టీ తాగాలంటే గంట త‌ర్వాత తీసుకోవాలి. వెంట‌నే తీసుకుంటే తిన్న ఆహారం ఆల‌స్యంగా జీర్ణ‌మ‌వుతుంద‌ట‌. రాత్రి స‌మ‌యంలో గ్రీన్ టీ తాగ‌క‌పోవ‌డ‌మే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే గ్రీన్ టీలో ఉండే కెఫీన్ నిద్ర‌కు ఆటంకం క‌లిగిస్తుంది. అందుకు రాత్రి స‌మ‌యంలో తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది.

అయితే గ్రీన్‌టీ ఎలా ఉప‌యోగించాలి.

  • గ్రీన్ టీ మంచిది అని ఎన్ని సార్లు తీసుకున్నా తప్పు కాదని భావిస్తుంటారు. కానీ అది సరి కాదు. మామూలు కాఫీ, టీలలో ఉన్నట్లే గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది. అందుకే రోజుకి రెండు మూడు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తీసుకోకూడదు.
  • భోజనం చేసిన వెంటనే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచిది కాదు. ఆహారంలో ఉన్న ప్రొటీన్‌ని శరీరం గ్రహించుకోనివ్వదు. ఇది గ్రీన్‌టీకి కూడా వర్తిస్తుంది.
  • గ్రీన్ టీని వేడిగా తాగకూడాదు. గోరు వెచ్చగా తాగాలి.
  • పరగడుపున ఎప్పుడూ తాగకూడదు. ఖాళీ కడుపులో ఆసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. గ్రీన్ టీ ఎప్పుడైనా ఏదైనా తిన్న తరువాతే తీసుకోవాలి.
  • వేడిగా ఉన్నప్పుడు గ్రీన్‌టీలో తేనె కలపకూడదు. గోరు వెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి.
  • ఇక ట్యాబెట్లు లాంటివి గ్రీన్ టీ తాగే ముందు వేసుకోకూడదు.
  • గ్రీన్ టీ బ్యాగ్‌ని కానీ, ఆకులు కానీ ఎక్కువ సేపు వేడి నీటిలో ఉంచకూడదు.
  • గ్రీన్ టీ బ్యాగ్స్‌ని గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి.
Leave A Reply

Your email address will not be published.