ఆషాడమాసం.. గోల్కొండలో ప్రారంభమైన బోనాల వేడుక

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. గురవారం గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం బోనాలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రలు ఇంద్రకరణ్ రెడ్డి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిక్ పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాలతో పోతురాజులు, మేళతాళాలతో ఊరేగింపు ప్రారంభించారు. ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యులు , ప్రధాన ఆర్చకుల ఇంట్లో పూజలు నిర్వహించారు. ఊరేగింపు లంగర్ హౌస్ నుండి తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయం వరకు కొనసాగుతుంది.