నగరానికి చెందిన విద్యావేత్త కిడ్నాప్.. ఆపై హత్య!
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని సికింద్రాబాద్‌లో ఉండే విద్యావేత్త హత్యకుగురైనట్లు సమాచారం. విక్రంపురిలో నివాసం ఉండే రమేశ్.. కాచిగూడలో కిడ్నాప్ చేసిన దుండగులు హత్య చేసినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీన రమేశ్ భార్య .. తన భర్త కనిపించడం లేదని కార్ఖానా పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. బండ్లగూడకు చెందిన వ్యాపారవేత్త అహ్మద్ ఖాద్రిపై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖాద్రిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను నిజం ఒప్పుకున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో రమేశ్‌ను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు అతను అంగీకరించినట్లు సమాచారం.