దోమలగూడలోని ఓ ఇంట్లో గ్యాస్‌లీకయ్యి అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని దోమలగూడలో అగ్రిప్రమాదం జరిగింది. రోజ్‌కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరకొని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.