12 గంటల్లో మరమ్మతులు పూర్తి.. నీటి సరఫరా పునరుద్ధరణ
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో మంచినీటి సరఫరా మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-1 లో కలబ్ గూర్ నుంచి లింగంపల్లి వరకు గల పీఎస్సీ, ఎంఎస్ పైపులైనుకు ఏర్పడ్డ లీకేజీలకు 5 ప్రాంతాల్లో మరమ్మతులు పూర్తి అయ్యాయని జలమండలి అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో 12 గంటల్లో పూర్తి చేశారు. కందివాగు, ఇస్నాపూర్, బీరంగూడ, అశోక్‌నగర్, బీహెచ్‌ఈఎల్ మెయిన్ గేట్, హుడా కాలనీ చందానగర్ ప్రాంతాల్లో రిపేర్లు పూర్తయ్యాయి. ఈ పనులు చేపట్టడానికి మైక్రో లెవెల్ ప్లానింగ్ అమలు చేశారు. తగిన యంత్రాలు, కార్మికుల సాయంతో జలమండలి అధికారులు, సిబ్బంది రికార్డు స్థాయిలో 12 గంటల్లో పూర్తి చేశారు.
పైప్‌లైన్ లీకేజ్ మరమ్మతులు రికార్డు స్థాయిలో 12 గంటలకే పూర్తి చేసి, సరఫరా పునరుద్ధరించిన అధికారులు, సిబ్బందిని ఎండి అశోక్ రెడ్డి, ఇడి మయాంక్ మిట్టల్ అభినందించారు.
ఈ నెల 6న నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం