Hyderabad: టెంట్ వేస్తున్న క్ర‌మంలో క‌రెంట్‌షాక్‌కు గురై వ్య‌క్తి మృతి

మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి

హైద‌రాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ లోని తిరుమ‌లగిరిలో క‌రెంట్ షాక్‌కు గురై ఒక‌రు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌ర్వ‌స‌తిన‌గ‌ర్‌లోని ఓ ఇంట్లో శుభ‌కార్యం నిమిత్తం టెంట్ వేసిన యువ‌కులు కార్య‌క్ర‌మానాంత‌రం ఆ పందిరిని తొల‌గిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు నిలుచున్న నిచ్చెన‌కు క‌రెంట్ వైర్లు త‌గ‌ల‌డంతో విద్యాదాఘాతానికి గురై అంద‌రూ కింద‌ప‌డిపోయారు. వారిలో ఒక‌రు మృతి చెంద‌గా.. మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు.

Suravaram Sudhakar Reddy: `సుర‌వ‌రం` క‌న్నుమూత‌

Leave A Reply

Your email address will not be published.