స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు..20 మంది అరెస్టు

హైదరాబాద్ (CLiC2NEWS): స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ఒకటిలోని నవీన్‌నగర్‌లో ఏరోనాటిక్ బ్యూటీ స్పా పేరుతో ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్పా సెంటర్‌పై దాడులు నిర్వహించి.. 10 మంది మహిళలు, 10 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు.