పాలు విరగడం అంటే..
మనం సాధారణంగా పాలను స్టవ్ మీద పెట్టి వేడిచేయగానే విరిగిపోవడం చూస్తుంటాం. లేదా పాలను ఎక్కువ సేపు వేడి చేయకుండా ఉన్నా కూడా పాలు విరిగిపోతాయి. చిన్న ముక్కలుగా.. లేదా ముద్దలుగా విడిపోయి, మధ్య మధ్యలో నీరు కనిపిస్తుంటుంది. దీంతో మనం పాలు విరిగి పోయాయని (పగిలి పోయాయని ) అంటూంటాం. వాటిని టి, కాఫీ వంటి వాటికి వాడకుండా ఉంటాం. కానీ వాస్తవానికి అది పాలు విరగటం కాదట.. పాలు నీటి నుండి వేరవడం.
కొంత మంది పాలను వివిధ పద్దతుల్లో విరిగిపోయేలా చేసి.. వాటితో స్వీట్లు , ఇతర వంటకాలు చేస్తుంటారు. పన్నీర్ కూడా పాలను విరగొట్టి మరీ చేస్తారు కదా. కొంతమంది విరిగిన పాలను వాడరు. పారబోస్తారు.
అసలు పాలు ఎందుకు విరుగుతాయంటే పాలలో కెసీన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఆవు , గేదె పాలలో 85% నీరే ఉంటుంది. ఆనీటి వలన పాలు ద్రవపదార్థంలా ఉంటాయట. అదే నీటిని బయటి నుండి కలిపితే అవి కల్తీ అవుతాయి. వేడి చేసినపుడు.. పాలలో ఉండే నీటితో వేరు పడుతుంది. అలాగే పాలలో ఆమ్లత పెరిగినపుడు, పులుపు పదార్థాలు తగిలినపుడు కూడా పాలు ముద్దలు ముద్దలుగా గాని, ముక్కులుగా విడిపోయి కనిపిస్తుంది. ఇది ఒక రసాయనిక ప్రక్రియ అని చెబుతున్నారు నిపుణులు.