అక్రమ నల్లా కనెక్షన్ పొందిన ఇద్దరిపై కేసు నమోదు

హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన ఇద్దరి వ్యక్తుల మీద జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసారు.
వివరాలు.. పీర్జాదిగూడ, మల్లికార్జున నగర్ లోని ఇంటి నెం.1-76, యజమాని యాదగిరి జలమండలి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నాడు. జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలో బయటపడ్డ ఈ విషయం పై సంబంధిత యజమాని పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269,430 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసారు.
మరోవైపు… పీర్జాదిగూడ, మల్లికార్జున నగర్ లోని ఇంటి నెం.1-80/1/1 నివాసం ఉంటున్నరంగ రెడ్డి జలమండలి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నాడు. జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలో బయటపడ్డ ఈ విషయం పై సంబంధిత యజమాని పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269,430 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసారు.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందంకు లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరు.